బంగారు నాణేలు పంచిన కీర్తిసురేశ్

మహనటి తో మెప్పించి, ఎన్టీఆర్ బయోపిక్ లో నటిస్తున్న హీరోయిన్ కీర్తిసురేశ్ తనతో కలసి పనిచేసిన పందెం కోడి 2 సినిమా యూనిట్ కు బంగారు నాణేలు బహుమతిగా ఇచ్చి అందర్నీ సర్ప్రైజ్ చేశారు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై విశాల్ నిర్మిస్తున్న పందెంకోడి2 సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. ఈ సినిమాలో విశాల్ కు జోడీగా కీర్తిసురేశ్ నటిస్తున్నారు.దీనికి డైరెక్టర్ గా లింగుస్వామి, మ్యూజిక్ డైరెక్టర్ గా యువన్ శంకర్ రాజాలు చేస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి విశాల్ & టీమ్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి రోజు, చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా అందరూ కేక్ కట్ చేసి ఫోటోలు దిగుతుండగా కీర్తిసురేశ్ అందరికీ బంగారు నాణేలు ఇచ్చి సప్రైజ్ చేశారు. సాధారణంగా షూటింగ్ చివరి రోజు స్టార్ హీరోలు యూనిట్ సబ్యులకు బంగారం బహుమతిగా ఇస్తుంటారు. నటి జ్యోతిక తొలిసారిగా తన సినిమా కాట్రిన్ మొళి యూనిట్ సబ్యులకు ఖరీదైన చేతి గడియారాలు బహుమతిగా ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here