కేసీఆర్ తెలంగాణకు పట్టిన చీడపురుగు:బాబూ మోహన్

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సినీనటుడు, మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత బాబూ మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తెలంగాణకు పట్టిన చీడపురుగు అని, తొందరగా వదిలించుకోవలని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆందోల్ లో బీజేపీ అభ్యర్థిగా బాబూ మోహన్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ వెనుకబడిన చిన్న కులాలను కలుపుకుని వెళుతున్నది బీజేపీ పార్టీనని, అణగదొక్కుతున్న పార్టీ టిఆర్ఎస్ అని బాబూ మోహన్ అన్నారు. ఇప్పటికైనా ప్రజలు మేల్కొనాలని, మాయమాటలు, పిట్టకథలు, సోధి కథలు విని మోసపోవద్దని బాబూ మోహన్ సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here