బంగారు బోనం ఎత్తిన కవిత

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం ఆదయ్య నగర్ కమాన్ నుంచి నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కవిత బంగారు బోనం ఎత్తుకుని మహంకాళి ఆలయానికి బయలుదేరారు. బంగారు బోనంతో పాటు 1016 బోనాలతో అమ్మవారి ఆలయం వరకూ భారీ ఎత్తున ఊరేగింపు కార్యక్రామాన్ని దేవాదాయ శాఖ మంత్రి ఏ. ఇంద్రకరణ్ రెడ్డి, మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కలసి ప్రారంభించారు. బంగారు బోనం ఊరేగింపు ఆడయ్యనగర్ నుంచి ప్రారంభమై సిటీలైట్ హోటల్, ఆర్మీ రోడ్, సుభాష్ రోడ్డు మీదుగా మహంకాళి ఆలయానికి చేరుకుంటుంది. ఈ వేడుకకు భక్తులు భారీగా తరలివచ్చారు. అమ్మవారికి సమర్పించేందుకు మూడు కిలోల ఎనబై గ్రాముల బంగారంతో బోనంను తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తయారు చేయించిన విషయం విదితమే……KS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here