కౌశల్ ఆర్మీకి చిక్కేది ఎవరు..? బాబు ..? లేదా తనీష్..?

రోజు రోజు కీ బిగ్ బాస్ సీజన్ 2 ఆసక్తి కరంగా మారింది. నార్మల్ పర్సన్ గా అడుగుపెట్టిన వారితో పాటు.. ఒక్క టివి యాక్టర్ గా అడుగు పెట్టిన కౌశల్ తనదైన నడవడికతో ప్రేక్షకులను కట్టుకున్నాడు.. ముఖ్యంగా కొంత మంది కౌశల్ ను టార్గెట్ చేసి ఏడిపించడం ప్రేక్షకుల్లో సానుభూతిని తీసుకొచ్చింది… దీంతో అప్పటి వరకూ కౌశల్ కు ఒక్కొక్కరు గా ఉన్న ఫ్యాన్స్ ఒక్కటిగా మారి కౌశల్ ఆర్మీ తో ఒక ప్రభంజనం సృష్టిస్తున్నారు.. అంతేకాదు.. బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 ఎలిమినేషన్‌ ప్రాసెస్‌ని కౌశల్‌ ఆర్మీ శాస్తిస్తోంది. ఇక వీరి టార్గెట్ గా ఎప్పటి నుంచో సిని నటుడు తనీష్‌, ప్రముఖ హేతువాది బాబు గోగినేని ఇద్దరూ ఈసారి నామినేషన్లలో దొరికేసారు.
ఈసారి నామినేషన్‌కి ఫిజికల్ టాస్క్ పెట్టారు.. ఈ టాస్క్ లో ఎటువంటి పోటీ ఇవ్వకుండా ఓడిపోయిన బాబు గోగినేని ముందుగానే నామినేట్ అయ్యాడు. అంతేకాదు.. ఆడవాళ్ళను తోసి తాను గెలవడం ఇష్టం లేకపోవడంతో పోటీలో పాల్గోనలేదని అందుకని తాను ఓడిపోయినా గెలిచినట్లే అని తన ఓటమికి ఒక రీజన్ కూడా చెప్పాడు… దీంతో ప్రేక్షకుల్లో బాబు గోగినేని సపోర్టింగ్ స్పిరిట్ చూపించలేదు అని ఫీలింగ్ కలిగింది.
ఇక ఎలిమినేట్ లో నామినేట్ అయిన మరో వ్యక్తీ తనీష్ యధాప్రకారం మరోసారి దీప్తి సునయనను నామినేషన్ నుంచి కాపాడం కోసం తాను నామినేషన్ లో ఇరుక్కున్నాడు.. సర్వత్రా విమర్శలు పాలవుతున్నాడు.. ఎందుకంటే యుద్ధ రంగంలోకి దిగిన తర్వాత నిజాయతీగా గెలుపుకోసం పోరాడాలి.. కానీ తనకి కావాల్సిన వ్యక్తులను కాపాడుకోవడం కోసం గ్రూపిజం చూపించాడు.. తనీష్ చేసిన పని కరెక్ట్ కాదు అనే మాట సర్వత్రా వినిపిస్తోంది. బాబు గోగినేనీ, తనీష్ లతో పాటు ఈ టాస్క్ లో గీతామాధురి, శ్యామల, గణేష్‌, దీప్తి నల్లమోతు కూడా ఎలిమినేషన్ జోన్ లో నామినేట్‌ అయ్యారు. ఈసారి కౌశల్ నామినేషన్ లో లేకపోవడంతో కౌశల్ ఆర్మీ ఎలాగైనా తనీష్ లేదా బాబు గోగినేనిని ల్లో ఒకరిని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రప్పించాలని ఓటింగ్ పై దృష్టి పెట్టినల్టు తెలుస్తోంది. తమ ఓట్లు మిగిలిన గీతామాదురికి, శ్యామల, గణేష్, దీప్తి నల్లమోతు లకు పంచుతూ వీరిని టార్గెట్ చేశారు.. ఐతే ఇదే సమయంలో కౌశల్ వ్యతిరేక వర్గం వారు ఈ ఇద్దరినీ కాపాడుకోవలాని చూస్తుందని తెలుస్తోంది.. ఐతే.. గ్రూప్ లో ఒక్కరు ఉంటె తమ ఓటింగ్ ద్వారా కాపాడుకొనే వారు. మరి… కానీ టార్గెట్ లో ఇద్దరు ఉండడంతో ఎవరు వెళ్తారు.. ఎవరు మిగులుతారు … లేదా ఎక్కడైనా లక్ ఉంటె.. వీరిద్దరూ సేఫ్ జోన్ లో ఉండి… గణేష్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేస్తాడా చూడాలి. అయితే కౌశల్ నామినేట్ కాని సమయంలో ఎవరొకరు పెద్ద తలకాయే బయటకు వస్తుంది.. దీంతో ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ చూసే ప్రతి ప్రేక్షుకుడు నెక్స్ట్ తనీష్ లేదా బాబు ఎలిమినేట ఖాయం అని అంటున్నారు.. ప్రస్తుతం పోలవుతున్న ఓటింగ్ ట్రెండ్స్ కూడా వీరికి వ్యతిరేక పవనాలు వీస్తున్నల్టు చెబుతున్నాయి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here