Crime News

కత్తి మహేష్ పైన కేసు పెట్టాలని ఆదేశించిన తెనాలి కోర్టు

శ్రీరాముడుని దూషించి హైదరాబాద్ నగర బహిష్కరణ ఎదుర్కొంటున్న కత్తి మహేష్ పైన కేసు నమోదు చేయాలని తెనాలి కోర్టు ఆదేశించింది.కత్తి మహేష్ ఒక న్యూస్ ఛానెల్ చర్చలో పాల్గొన్న సందర్భంగా సీతారాములను దూషించి హిందువుల మనోభావాలను దెబ్బతీసారని, హిందూవాహిని ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు స్పందించకపోవడంతో, హిందూవాహిని అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిని విచారించిన న్యాయమూర్తి వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని ఆదేశించారని పాటిబండ్ల రామకృష్ణ మీడియాకు తెలిపారు.

Comment here