విషమించిన కరుణానిధి ఆరోగ్యం

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్య పరిస్థితి పైన కావేరీ హాస్పిటల్ యాజమాన్యం కొద్దిసేపట్లో హెల్త్ బులెటెన్ విడుదల చేయనుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం కరుణానిధి ఆరోగ్యం విషమించినట్లుగా తెలుస్తోంది.ఆయన పల్స్ రేటు భాగాపడిపోయినట్లు చెబుతున్నారు. ఆయన కుటుంబ సభ్యులు, డీఎంకే పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున హాస్పిటల్ కు చేరుకుంటున్నారు. కరుణానిధి పరిస్థితి విషమించినట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో, సేలం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి పళనిస్వామి, అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని చెన్నై పయనమయ్యారు. హాస్పిటల్ వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు డీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద కూడా భద్రతను పెంచారు.కేంద్ర మాజీమంత్రి పి.చిదంబరం, దీపా జయకుమార్ సహా ప్రముఖలు ఒక్కొక్కరుగా హాస్పిటల్ కు చేరుకుంటున్నారు……KS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here