కరుణానిధి పరిస్థితి విషమం : కావేరి ఆస్పత్రి వైద్యులు

కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటెన్ విడుదల. కరుణానిధి ఆరోగ్య పరిస్థితి విషమం అని వెల్లడి. వైద్యుల పర్యవేక్షణలో కరుణానిధికి చికిత్స. కావేరీ ఆస్పత్రి దగ్గర ఉద్రిక్తత. భారీగా పోలీసులు మొహరింపు.ఆస్పత్రి ఆవరణ నుండి అభిమానులు, కార్యకర్తలను బయటికి వెళ్లిపోవాలని డీఎంకే నేత రాజా సూచన. డీఎంకే కార్యకర్తలను అదుపు చేయలేకపోతున్న పోలీసులు.లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు, తిరగబడ్డ కార్యకర్తలు. చెప్పులు, రాళ్లతో పోలీసులపై ఎదురుదాడి. ప్రజలకు అసౌకర్యం కలిగించవద్దని కార్యకర్తలకు స్టాలిన్ విజ్ఞప్తి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడవద్దని చెప్తున్న స్టాలిన్. నగరమంతా హైఅలర్ట్ ప్రకటించిన పోలీసులు. ఒంటిగంటకు ఆస్పత్రికి చేరుకోనున్న ముఖ్యమంత్రి పళనిస్వామి. వేలచేరీలో రెండు ఆటోలకు నిప్పుపెట్టిన డీఎంకే కార్యకర్తలు.మొత్తం మీద చెన్నైలో ఏం జరుగుతుందో తెలియని పరిస్ధితి నెలకొంది. కావేరీ ఆస్పత్రి చుట్టుపక్కల , కరుణానిధి అభిమానులు, కార్యకర్తలు తీవ్ర ఆందోళన చేస్తున్నారు….KS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here