అభిమానుల సందర్శనార్ధం రాజాజీ హాల్ లో కరుణానిధి పార్ధీవ దేహం

మూత్రనాళం ఇన్ఫెక్షన్, జ్వరంతో బాధపడుతున్న కరుణానిధికి గత కొంతకాలం ఇంట్లోనే చికిత్స జరిగింది. ఈ క్రమంలో తీవ్ర అస్వస్థత చేయడంతో ఆయన్ని జులై 26న చెన్నై నగరంలోని కావేరి హాస్పిటల్‌కు తరలించారు. 13 రోజులుగా ఆయన కావేరి హాస్పిటల్‌లోనే చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో కరుణానిధి ఆరోగ్యం మరింత విషమించడంతో.. మంగళవారం సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు తుది శ్వాస విడిచినట్టు కావేరి ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. కరుణానిధి పార్థివదేహాన్ని కావేరీ ఆసుపత్రి నుంచి బయటకు తీసుకొచ్చే సమయంలో.. అక్కడ ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. అద్దాల బాక్స్‌లో పెట్టిన కరుణ మృతదేహాన్ని చూసేందుకు ఆసుపత్రి బయట ఉన్న అభిమానులు ఎగబడ్డారు. అనంతరం పార్థివదేహాన్ని గోపాలపురంలోని నివాసానికి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు.. అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత సీఐటీ కాలనీలోని ఇంటికి తరలించారు. ఉదయం నుంచి అభిమానుల సందర్శనార్థం రాజాజీ హాల్‌లో పార్థివదేహాన్ని ఉంచారు.. ఆయన పార్ధీవ దేహాన్ని చూడడానికి అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో విచ్చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here