కరుణానిధి తెలుగులో స్క్రీన్ ప్లే అందించిన సినిమా ఎవరిదో తెలుసా..!

కరుణానిధి మంచి సాహితీవేత్త, సిని కథా రచయిత. సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగు పెట్టినా తన మూలాలను మరచిపోలేదు.. ఎంత బిజీగా ఉన్నా సిని పరిశ్రమతో ఉన్న అనుబంధాన్ని కొనసాగిస్తూనే వచ్చారు. ఆయానకు కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కుడా మంచి అనుబంధం ఉంది.. కరుణానిధి మేనల్లుడు మురసోలి సెల్వం తెలుగులో నిర్మించిన అమ్మాయి మొగుడు మామకు యముడు సినిమాకు కరుణానిధి స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమాలో సూపర్ కృష్ణ హీరోగా నటించారు.. తమిళంలో జయ శంకర్, జయచిత్ర నటించిన ‘వండిక్కారణ్ మగన్’ సినిమాకు అనువాదం తెలుగులో ఈ సినిమా తెరకెక్కింది. తమిళ సినిమాకు మాటలు రాసిన కరుణానిధి తెలుగులో మాత్రం స్క్రీన్ ప్లే అందించారు.. అప్పట్లో రామానాయుడు నిర్మించిన సూపర్ మూవీ ప్రేమ నగర్ సినిమా శతదినోత్స వేడుకలకు కరుణానిధి హాజరై… నటీనటులకు.. చిత్ర బృందానికి జ్ఞాపికలు అందించారు. అంతేకాదు దాసరి దర్శకత్వం వహించిన ‘నీడ’ చిత్ర శతదినోత్సవానికి కూడా కరుణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలుగు సినిమా ప్రముఖులతో తన అనుబంధాన్ని కొనసాగించారు.. ముఖ్యంగా సిని రంగం నుంచి రాజకీయాలలో అడుగుపెట్టిన ఎన్టీఆర్ తో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here