ప్రియమైన శత్రువుకి కవితతో వీడ్కోలు పలికిన కరుణానిధి..

తమిళ రాజకీయాల్లో అన్నాడిఎంకె అధినేత ఎమ్జీఆర్, డిఎంకే అధినేత అన్నాదురై ల మధ్య తీవ్ర పోటీ ఉండేది.. ఇక ఈ పోటీలో అన్నాదురై, ఎమ్జీఆర్ ల వరకూ ఈ పోటీ రాజకీయలేకె పరిమితమైంది. అనంతరం డిఎంకే అధినేతగా కరుణానిధి, అన్నాడిఎంకె అధినేతగా జయలలిత లు పగ్గాలు చేపట్టిన తర్వాత ఈ పోటీ వ్యక్తిగత పగ, ప్రతీకారాలకు దారి తీసింది. 2001 లో జయలలిత సిఎం గా పదవి చేపట్టాక.. కరుణానిధిని అర్ధరాత్రి జైల్లో పెట్టించారు. డీఎంకే తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత.. జయను అదే జైలుకి పంపించేదాకా కరుణానిధి శాంతించలేదు. ఆ తర్వాత వయసు మీద పడటంతో జయలలితతో తన వైరాన్ని కాస్త సడలించుకున్నారు. జయ మరణం తర్వాత ఆమెపై కవిత రాసిన కరుణానిధి… తన ప్రియ శత్రువుకి శాశ్వతంగా వీడ్కోలు పలికారు. అయితే తమిళులు ఎంతగానో ఆదరించి ఇద్దరి రాజకీయ నేతలను రెండేళ్ళ వ్యవధిలోనే కోల్పోయారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here