గుర్తుపట్టలేని విధంగా ఆస్పత్రిలో కరుణానిధి… ఇదిగో సాక్ష్యం

మాజీ సిఎం రాజకీయ కురువృద్ధుడు డిఎంకె అధినేత కరుణానిధి (94) తీవ్ర అస్వస్థతతో చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగా ఉండనే వార్తలు వినిపించడంతో కార్యకర్తలు, అభిమానులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. తమ అధినేత ఆరోగ్యంగా ఉండాలని కార్యకర్తలు పూజలు చేస్తున్నారు. వారికి ఉరట ఇచ్చేలా తాజాగా ఒక ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కరుణానిధి పరామర్శించడానికి ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ కావేరి ఆసుపత్రికి వచ్చారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోఒకటి వైరల్ అయ్యింది. కరుణా నిధి చాలా బలహీనంగా కనిపిస్తోండగా.. ఆయన చెవిలో కుమారుడు స్టాలిన్ ఎదో చెబుతున్నట్లు కనిపిస్తోంది. రాహుల్ గాంధీ… కరుణానిధిని పరామర్శించి వెళ్ళిన అనతరం ఓ ట్విట్ చేశారు. కరుణానిధి చాలా ధృడమైన వ్యక్తీ.. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది… అని ట్విట్ చేశారు. ఈ ఫోటో చుసిన అభిమానులు ఊరట చెందారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here