కరుణానిధి మృతిపై ప్రముఖుల సంతాపం

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మృతిపై రాష్ట్రపతి రామనాధ్ కొవింద్ సంతాపం ప్రకటించారు. ఆయనలేని లోటును ఎవరూ తీర్చలేరని, ఆయన కుటుంబ సభ్యులకు, అశేష అభిమానులకు ఆయన సానుభూతిని ప్రకటించారు. అటు ప్రధాని నరేంద్ర మోదీ కూడా కరుణానిధి మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. తాను పలుసార్లు కరుణానిధిని కలిశానని, తమిళప్రజల కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదని గుర్తు చేశారు. ఎమర్జెన్సీ విధించిన సమయంలో కూడా ప్రజాస్వామ్యబధ్ధంగా ప్రతిపక్షంలో ఎదురు నిలిచారన్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా కరుణానిధి మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. కాకలు తీరిన రాజకీయ యోధుడు కరుణానిధి మరణం దేశానికి తీరనిలోటని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. చలనచిత్ర, పత్రికా రంగంతోపాటు, రాజకీయ రంగంతో తమిళనాడు ప్రజల గుండెల్లో నిలిచిపోయారని చంద్రబాబు పేర్కొన్నారు. 5 సార్లుముఖ్యమంత్రిగా, 13సార్లు ఎమ్మెల్యేగా, 50 ఏళ్ల పాటు పార్టీ అధ్యక్షుడుగా, 75ఏళ్ళ రాజకీయ జీవితంలో అందరికీ ఆదర్శంగా ఉన్నారని తెలిపారు. తను నమ్మిన ద్రవిడ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లారని చెప్పారు. ఆయన జీవించిన కాలం తమిళనాడులో కరుణానిధి శకంగా మిగిలిపోతుందని పేర్కొన్నారు. తమిళ ప్రజలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here