కరుణానిధి మృతిపై విదేశీ మీడియా….

బీబీసీ: తమిళనాడు ప్రజల ఆరాధ్యదైవం, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కన్నుమూశారు.ఆయన రాజకీయ బ్రహ్మ. తుదిశ్వాస వరకూ డీఎంకే అధినేతగా కొనసాగారు. అప్పట్లో కులవిద్వేషాలకు వ్యతిరేకంగా పోరాడారు అని పేర్కొంది.

సీఎన్ఎన్: కరుణానిధి 14 సంవత్సరాల వయస్సులోనే రాజకీయాల్లోకి ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగారు. 1969వ సంవత్సరంలో కరుణానిధి తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యారు. డీఎంకే అధినేతగా కూడా కొనసాగారు. తమిళనాడు ప్రజల కోసం ఎన్నో సేవలు చేశారని పేర్కొంది.

సేలన్ టుడే: తమిళనాడు ప్రజల హీరోగా కొనసాగిన ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఇకలేరు. పేదలకు ఆయన ఆరాధ్యదైవం. తమిళనాడులో ఇక ఆయన శకం ముగిసినట్లే. ఆయన స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరు. అని రాసింది.

వాషింగ్టన్ పోస్ట్: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కన్ను మూశారు. రాజకీయ, సినీ రంగాల్లో ఆయన చెరగని ముద్ర వేసుకున్నారు. తమిళ సినీ రంగంలో ఆయన 1950లో ప్రవేశించారు. ఐదు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో సేవలు చేశారు. తొలిసారిగా 1969లో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆయన షుమారు 19 సంవత్సరాల పాటు పలుమార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. డీఎంకే పార్టీ అధినేతగా ఎన్నో సంవత్సరాలు కొనసాగారని రాసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here