National

పూర్తైన కరుణానిధి అంత్యక్రియలు

మెరీనా బీచ్ లోని అన్నా స్క్వేర్ ప్రాంగణంలో ప్రభుత్వ లాంఛనాలతో కరుణానిధి అంత్యక్రియలు పూర్తయ్యాయి. కరుణానిధి భౌతిక కాయంపై జాతీయ పతాకాన్ని కప్పి సైనికులు గౌరవ వందనం సమర్పించారు. కుటుంబ సభ్యులు అంతిమ నివాళులు అర్పించిన అనంతరం కరుణానిధి పార్ధీవ దేహాన్ని ఖననం చేశారు. కరుణానిధి అంత్యక్రియల్లో తమిళనాడు గవర్నర్, సీఎం పళని స్వామి, కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాంధీ, గులాంనబీ అజాద్, శరద్ పవార్, చంద్రబాబు, దేవేగౌడ, డెరెక్ ఒబ్రియన్, సినీ, రాజకీయ ప్రముఖులు, డీఎంకే శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు.

Comment here