ప్రేమించిన అమ్మాయితో తాళిలేకుండా పెళ్లి అన్న కరుణానిధి.. జీవితాంతం పెళ్లి చేసుకోని ప్రియురాలు

డిఎంకె అధినేత మాజీ సిఎం కరుణానిధి వృధ్యాప్యంతో వచ్చే అనారోగ్యంతో తన 94వ ఏట మృతి చెందారు.. ఆయన వ్యక్తి గత జీవితానికి సంబంధించిన సంఘటనలను చెన్నై కి చెందిన సీనియర్ జర్నలిస్టు ఆన్ నూల్ అల్లా గుర్తు చేసుకున్నారు. కరుణానిధి నాయి బ్రాహ్మణా కుటుంబలో పుట్టిన వ్యక్తీ.. కానీ హిందూ సంప్రదాయాలకు, దైవారాధనకు పూర్తీ వ్యతిరేకి.. నాస్తికుడు… దీంతో తాను మొదటి సారి ప్రేమించిన అమ్మాయితో పెళ్లి కూడా వదులు కున్నారని ఆ జర్నలిస్టు గుర్తు చేసుకున్నారు. కరుణా నిధి పెళ్లికి గుర్తుగా నిలిచే తాళిబొట్టును ప్రియురాలి మెడలో కట్టేందుకు అంగీకరించలేదట. 1944 ప్రాంతంలో కరుణానిధి ఓ అమ్మాయిని ప్రేమించగా, వారికి వివాహం చేసేందుకు ప్రియురాలి కుటుంబీకులు అంగీకరించారట. అయితే అమ్మాయి ఫ్యామిలీ ఒక కండిషన్ పెట్టింది.. అదే తమ కూతురు పెళ్లి సంప్రదాయబద్ధంగా జరగాలని.. అయితే కరుణానిధి తనకు తాళిబొట్టన్నా, మంత్రాలన్నా పడవని తెగేసి చెప్పడమే కాదు… అవి లేకుండా వివాహమంటే సరేనని అన్నారట. దీంతో తాను ప్రేమించిన అమ్మాయి తో పెళ్లి ఆగిపోయినా తన మాటను మార్చలేదు… దీంతో ఆవేదన చెందిన కరుణా ప్రియురాలు.. మరో పెళ్లి చేసుకోకుండా జీవితాంతం అవివాహితగానే ఉండిపోయిందని నూర్ చెప్పారు.. ఆచారాలను తీవ్రంగా వ్యతిరేకించే కరుణానిధి మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు.. పెద్ద భార్య పద్మావతి ఎప్పుడో మరణించగా… ప్రస్తుతం రెండో భార్య దయాళు అమ్మాళ్, మూడో భార్య రాజదీ అమ్మాళ్ ఉన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here