మెరీనా బీచ్ లో కరుణానిధి అంత్యక్రియలకు గ్రీన్ సిగ్నల్

చెన్నై లోని మెరీనా బీచ్ లో కరుణానిధి అంత్యక్రియలకు ప్రభుత్వం అభ్యంతరం చెప్పడంతో కరుణానిధి తనయులు మద్రాస్ హైకోర్టు గడప ఎక్కారు. ఈ నేపథ్యంలో కోర్టు తన తీర్పు చెప్పింది. మెరీనా బీచ్ లో కరుణా నిధి అంత్యక్రియలు నిర్వహించుకునేందుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో రాజాజీ హాల్ వద్ద భావోద్వేగం కనిపించింది. కోర్టు తీర్పు తెలిసిన వెంటనే మైకుల ద్వారా ఈ విషయం ప్రకటించారు. అక్కడ ఉన్న స్టాలిన్, అళగిరి, కనిమొళి తదితరులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అక్కడ వేలాదిగా ఉన్న కార్యకర్తలు కలైంజర్ వాంగే అంటూ నినదించారు. అప్పటి వరకు ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేస్తూ కరుణానిధికి నివాళులర్పిస్తున్న డిఎంకె కేడర్ ఇప్పుడు కలైంజర్ కలైంజర్ అంటూ నినాదం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here