Local news

చంద్రబాబుపై కాపూజాతికి నమ్మకముంది : ముద్రగడ

సీఎం చంద్రబాబు నాయుడు పైన మాకు నమ్మకముందని కాపు రిజర్వేషన్లను ఆయన మాత్రమే అమలు చేయగలరని నమ్ముతున్నామని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అన్నారు. సీఎం చంద్రబాబు కాపూజాతికి ఎక్కడ రిజర్వేషన్లు కల్పించేస్తారేమోనని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మోకాలడ్డుతున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా కాపూజాతి తరుపున విన్నపం ఏంటంటే…, కాపు రిజర్వేషన్లను కేంద్రం పరిధిలో తరువాత అమలు చేద్దురుగాని…, రాష్ట్ర పరిధిలో తక్షణం అమలు చేయండి. ఆ అధికారం ముఖ్యమంత్రిగా మీకు ఉంది. వంకలు పెట్టకుండా మా కాపుజాతి ఆకలి తీర్చండి అంటూ ముద్రగడ పద్మనాభం సీఎం చంద్రబాబుకి విజ్ఞప్తి చేశారు. అధికారంలో ఉన్న చంద్రబాబు మాత్రమే తమ రిజర్వేషన్లు అమలు చేస్తారని, ఆశిస్తున్నామని ముద్రగడ పద్మనాభం అభిప్రాయం వ్యక్తం చేశారు….. KS

Comment here