కాపు రిజర్వేషన్ల అంశం రాష్ట్ర పరిధిలోనిది కాదని, అందుకే తాను కాపు రిజర్వేషన్లపైన హామీ ఇవ్వలేనని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తేల్చిచెప్పారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహించిన సభలో జగన్ మాట్లాడుతూ చంద్రబాబు ఒక్కో కులానికి ఒక్కో హామీ ఇచ్చారన్నారు. నేను మాటమీద నిలబడతానని, తాను చేయగలిగిందే చెబుతానని జగన్ తెలిపారు.రిజర్వేషన్లు 50 శాతం దాటితే చేయడం కుదరదని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేశారు. అధికారంలోకి వస్తే కాపు కార్పొరేషన్ కి చంద్రబాబు ఇచ్చిన నిధులకు రెట్టింపు నిధులు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు……KS
కాపు రిజర్వేషన్లపై హామీ ఇవ్వలేను : జగన్మోహన్ రెడ్డి

Related tags :
Comment here