క్రిష్ మణికర్ణిక కు పోటీగా.. హృతిక్ సూపర్ 3.0…ఆసక్తికరం..!!

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్..క్వీన్ కంగనా కి నిజ జీవితంలో ఒకరంటే ఒకరికి పడదు అనే సంగతి తెలిసిందే… ఇక తాజాగా వేరిద్దరూ తమ సినిమాలతో కూడా పోటీ పడనున్నారు. ఈ ఆసక్తికరమైన పోటీకి 2019 జనవరి 25 వేదిక కానుంది. కంగనా రనౌత్‌ నటించిన ‘మణికర్ణిక.. ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’, హృతిక్‌ రోషన్‌ నటించిన ‘సూపర్‌ 30’ చిత్రాలు రిపబ్లిక్ కానుకగా రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. బాలీవుడ్ లో హీరో రేంజ్ లో పేరు తెచ్చుకున్న కంగన కెరీర్‌లోనే ‘మణికర్ణిక’ ప్రతిష్టాత్మక చిత్రం. ఇక రెండేళ్ల తర్వాత హృతిక్‌ నటించిన చిత్రం ‘సూపర్‌ 3.0’… దీంతో ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. వారియర్‌ క్వీన్‌ రాణీ లక్ష్మీబాయిగా కంగన నటించిన ‘మణికర్ణిక’ చిత్రం నిజానికి ఈ ఏడాది ఏప్రిల్‌ 27నే విడుదల కావాలి. ఆ తర్వాత ఆగస్టు 15న విడుదల చేయాలనుకొన్నారు. ఆ రెండు డేట్లూ కుదరకపోవడంతో వచ్చే ఏడాది రిపబ్లిక్‌ దినోత్సవం సందర్భంగా జనవరి 25న విడుదల చేయాలని తాజాగా నిర్మాత కమల్‌ జైన్‌, జీ స్టూడియోస్‌ సంస్థలు నిర్ణయించాయి. ఆగస్ట్‌ 15న సినిమా టీజర్‌ను విడుదల చేస్తారట.ఇ టీవల కంగనా నిర్మాతలను కలవడానికి ప్రొడక్షన్‌ ఆఫీసుకు వెళ్లినప్పుడు సినిమాలో కొన్ని సీన్ల రష్‌ చూసి థ్రిల్‌ ఫీలయిందట. అందుకే ఆగస్ట్‌ 15న టీజర్‌ను విడుదల చేస్తే బాగుంటుందని ఆమె అనడంతో నిర్మాతలు కాదనలేకపోయారట. తెలుగు దర్శకుడు క్రిష్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇక ‘సూపర్‌ 30’ విషయానికి వస్తే గణిత శాస్త్రవేత్త ఆనంద్‌కుమార్‌ జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకొంటున్న ఈ సినిమాలో హృతిక్‌ సరికొత్త గెటప్‌లో కనిపించనున్నారు.

ఆయన సినిమా కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న అభిమానులను ఈ సినిమా తప్పకుండా అలరిస్తుందని అంటున్నారు. సో.. వచ్చే ఏడాది జనవరి 25 ఈ రెండు భారీ చిత్రాలతో బాక్సాఫీసులో ప్రకంపనలు పుట్టడం ఖాయమని చెబుతున్నారు. ఈ మాజీ లవర్స్ లో విజేత ఎవరో జనవరి 25 వరకూ వేచి చూడాల్సిందే..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here