తెలుగు బిగ్ బాస్ హౌస్ లోకి కమల్ హాసన్ ఎంట్రీ

హిందీ నుంచి బిగ్ బాస్ దక్షిణాది భాషల్లో అడుగు పెట్టింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నడుస్తోన్న ఈ బిగ్ బాస్ రియాల్టి షో లో ఇప్పటి వరకు ఒక భాషకు చెందిన హౌజ్ లోకి అడుగు పెట్టిన దాఖలాలు లేవు.. కానీ తాజగా అరుదైన సంఘటన ఆవిష్కారం కానున్నది. తమిళ్ బిగ్ బాస్ కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కమల్ హాసన్ తెలుగు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
కమల్ హాసన్ తాజా సినిమా విశ్వరూపం… 2 ఈ సినిమా పూర్తి అయ్యి త్వరలో రిలీజ్ కానున్నది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా కమల్ తెలుగు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ విషయాన్ని సినీ వర్గాలు సోషల్‌మీడియా ద్వారా వెల్లడించాయి. ‘బిగ్‌బాస్‌’ తమిళ వెర్షన్‌కు కమల్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండగా… తెలుగులో నేచురల్‌ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ‘బిగ్‌బాస్’ రెండో సీజన్‌ జరుగుతోంది. కమల్‌కు సంబంధించిన సన్నివేశాలను ఆదివారం ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో చూపించనున్నట్లు తెలుస్తోంది.

కాగా ఆగస్ట్ 10న ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలకానుంది విశ్వరూపం-2. ఈ మూవీకి సంబంధించి తెలుగు బిజినెస్ కంప్లీట్ అయింది. నైజాం, ఈస్ట్ ఏరియాల్లో సురేష్ మూవీస్ ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here