కళాతపస్వి కె. విశ్వనాధ్ బయోపిక్

భారత చలన చిత్ర పరిశ్రమలో లెజెండరి దర్శకుడు కళాతపస్వి కె. విశ్వనాధ్ జీవిత చరిత్ర వెండి తెరపై ఆవిష్కరించ నున్నది. విశ్వనాథదర్శనం అనే టైటిల్ తో వెండి తెర చెప్పిన బంగారు దర్శకుని కథ అనే ఉప శీర్షికతో తెరకెక్కుతున్నది.
ఈ సినిమాకు రచయిత కం దర్శకుడు అయిన జనార్ధన మహర్షి దర్శకత్వం వహిస్తున్నారు. గురు పున్నమి రోజున ముహర్తపు సన్నివేశాన్ని చిత్రీ కరణ జరుపుకున్నది.. ఈ సినిమా విశ్వనాధ్ గారి బాల్యం, నుంచి దర్శకుడుగా ఎదిగిన తీరు ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మహానటి సినిమాతో సావిత్రి జీవితం చుసిన ప్రేక్షకులు త్వరలో ఎన్టీఆర్, వైఎస్సార్ ల జీవిత చరిత్ర తో పాటు ఒక గొప్ప అభిరుచి ఉన్న దర్శకుడు విశ్వనాధ్ గారి జీవిత చరిత్రను కూడా ప్రేక్షకులు తెలుసుకొనే భాగ్యం త్వరలో కలుగానున్నది. ఈ సినిమాను వివేక్ కూచిభోట్ల, టిజి విశ్వప్రసాద్ లు నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here