చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సోము వీర్రాజు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ కరుడుగట్టిన తీవ్రవాది కంటే నిర్భయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. భోగాపురం ఎయిర్ పోర్టుకు మరోసారి టెండర్లు పిలవడం వెనుక కుట్ర ఉందని సోము వీర్రాజు ఆరోపించారు. ఎయిర్ పోర్ట్ అథారిటీని కాదని తనకు అనుకూలమైన వారికి విమానాశ్రయ భూములు కట్టబెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు అవినీతికి పంచభూతాలు సాక్ష్యాలు అవుతాయని సోము వీర్రాజు అన్నారు.., ఒక్క నీరు-చెట్టు పధకంలోనే 30వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. ఆంద్రప్రదేశ్ లో అవినీతి చక్రవర్తిని బర్తరఫ్ చేసే అవకాశాన్ని గవర్నర్ నరసింహన్ పరిశీలించాలని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here