జపాన్ బృందంతో చంద్రబాబు భేటి

ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు తో జపాన్ రాయబారి కెంజి హిరమట్సు బృందం భేటి అయ్యింది. ఉండవల్లిలో సిఎం స్వగృహంలో జరిగిన ఈ భేటిలో రాష్ట్ర అభివృద్ధిలో జపాన్ భాగస్వామ్యంపై చర్చించారు. వారి ఏపీలో ఉన్న అనేక సదుపాయాల గురించి, సహజ వనరుల గురించి వివరించారు. విజ్ఞానం పెంచే సంస్థలను ఏర్పాటు చేసినట్లయితే ఉపాధి, పెట్టుబడులు మెరుగుపడతాయని, అందుకు కావాల్సిన వనరులన్నీ నవ్యాంధ్రలో ఉన్నాయని జపాన్ బృందానికి సీఎం చంద్రబాబు తెలిపారు… అమరావతిలో డేటా సెంటర్, విపత్తుల నిరోధక వ్యవస్థ, విజయవాడలో ట్రాఫిక్ నియంత్రణ, తాగునీటి సరఫరా వ్యవస్థ, ముురుగునీటి పారుదలకు సంబంధించి ఐదుగురు సభ్యులతో కూడిన జపాన్ బృందం స్పష్టమైన ప్రతిపాదనలను సమర్పించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here