Local news

జగన్మోహన్ రెడ్డిపై దాడిని ఖండించిన చంద్రబాబు

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడిని తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు చంద్రబాబు పలువురు మంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా పరిణామాలపై చర్చించారు. ఇలాంటి దాడులను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇది సంబంధం లేని విషయమని స్పష్టం చేశారు. ఈ ఘటనను అడ్డుపెట్టుకుని అల్లర్లకు దిగితే సహించేది లేదని హెచ్చరించారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డిపై దాడిని తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు ముక్తకంఠంతో ఖండిస్తుండగా.. ఆంద్రప్రదేశ్ లో పలు ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులు ఆందోళనలకు దిగాయి. విషయం తెలిసిన వెంటనే డీజీపీకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని, ప్రభుత్వం సీరియస్ గా విచారణ జరుపుతోందని, వాస్తవాలను బయటకు తీసుకొస్తామంటూ పలువురు మంత్రులు చెబుతున్నారు.

Comment here