Local news

జగన్మోహన్ రెడ్డిపై దాడి గురించి ముందే చెప్పిన సినీనటుడు శివాజీ

వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి గురించి సినీనటుడు శివాజీ ముందే చెప్పిన విషయం తెలిసిందే. ఆపరేషన్ ద్రవిడ(గరుడ)పై గతంలో శివాజీ ఇచ్చిన ప్రజెంటేషన్లో ఆంధ్రప్రదేశ్ లోని ప్రతిపక్ష పార్టీ నాయకుడిపై దాడి జరుగుతుందని స్పష్టం చేశారు. దాడి ఎందుకు జరుగుతుంది? దాడి తర్వాత సంభవించే పరిణామాలు ఏమిటి? అనే విషయాన్ని కూడా శివాజీ వివరించిన సంగతి తెలిసిందే. జాతీయ పార్టీ నిర్వహించే ఆపరేషన్ గరుడలో భాగంగానే జగన్మోహన్ రెడ్డిపై దాడి జరగబోతోందని శివాజీ తన ప్రజెంటేషన్లో వివరించిన సంగతి తెలిసిందే. ప్రతిపక్ష నాయకుడిపై దాడి చేయడంతో రాష్ట్రంలో అల్లర్లు చెలరేగుతాయని, దాంతో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం సృష్టించి ప్రభుత్వాన్ని కూల్చే విధంగా ప్లాన్ చేస్తున్నారని శివాజీ పేర్కొన్న సంగతి తెలిసిందే.

Comment here