జగన్ వాదన విచిత్రంగా ఉంది : యనమల రామకృష్ణుడు

ఈడీ కేసులో జగన్మోహన్ రెడ్డి రాసిన బహిరంగ లేఖపై స్పందించిన మంత్రి యనమల రామకృష్ణుడు, ఈడీ కేసుల విషయంలో జగన్మోహన్ రెడ్డి వాదన విచిత్రంగా ఉందన్నారు. కేసులో కుటుంబ ప్రమేయం ఉందో, లేదో ముందు జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేయాలి. అవినీతి చెయ్యలేదని, చెప్పలేని జగన్మోహన్ రెడ్డి, దానిపై వచ్చిన వార్తలపై ఎలా ? అభ్యంతరం చెప్తారని ప్రశ్నించారు. లేనిది ఉన్నట్లుగా రాస్తే తప్పుపట్టాలి కానీ., కేసులో భారతి పేరుందని జగన్మోహన్ రెడ్డి అడ్వాకేట్లే చెబుతున్నారని, అలాంటప్పుడు ఎలా తప్పు పడతారని ప్రశ్నించారు. అసలు ఈడీ చార్జిషీట్ కి., టీడీపీ కి ఏంటి సంబంధమని నిలదీశారు. జగన్మోహన్ రెడ్డి వైఖరితోనే ఆయన కుటుంబ సభ్యులు ఇబ్బందిపడే పరిస్థితి వస్తోందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి, కేసులో పేరు ఉండటాన్ని ఎక్కడా ఖండించలేదన్నారు. కేసు ద్వారా సానుభూతి పొందేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here