Local news

జగన్, పవన్ లకు ధైర్యం లేదు : రామ్మోహన్ నాయుడు

ఒంగోలు ధర్మ పోరాట దీక్షలో పాల్గొన్న ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కి కేంద్రం సహకరించడంలేదని అన్నారు. బీజేపీ నేతలు వైసీపీ ట్రాప్ లో పడి ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వైసీపీ అధినేత జగన్ కు గాని, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు గాని ప్రధాని మోదీను విమర్శించే ధైర్యం లేదన్నారు. బీజేపీతో లాలూచీ పడ్డ ప్రతిపక్షాలకు ప్రజలే బుద్ధి చెప్పాలని రామ్మోహన్ నాయుడు అన్నారు. ఇదే కార్యక్రమంలో ఎంపీ మురళీ మోహన్ మాట్లాడుతూ విభజన సమయంలో హోదా 5 సంవత్సరాలు కాదు.10 సంవత్సరాలు ఇవ్వాలన్న బిజెపి, యూటర్న్ తీసుకుని మోసం చేసిందని మండిపడ్డారు. అవిశ్వాసం సందర్భంగా పార్లమెంటులో టీడీపీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అతి చేష్టలు చేశారని, ప్రాంతీయ పార్టీలను తొక్కేయాలని మోడీ చూస్తున్నారని ఆయన మండిపడ్డారు……. KS

Comment here