Local news

జగన్ పాదయాత్రను అడ్డుకున్న కాపు యువత… తోసేసిన భద్రతా సిబ్బంది

వైసిపి అధ్యక్షుడు ప్రతి పక్ష నేత జగన్ తన పాదయాత్రను తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.. ఆయన పాదయాత్ర ప్రసుత్తం కిర్లంపూడి మండలం గోనేడలో సాగుతున్నది.అక్కడ ఆయన కు చేదు అనుభవం ఎదురైంది. జగన్ పాదయాత్రను కాపులు అడ్డుకున్నారు. తమను మోసం చేయొద్దంటూ ప్లకార్డులతో కాపు యువత.. జగన్ ప్రజా సంకల్ప యాత్రను అడ్డుకుంది. జగ్గంపేట నుంచి రామచంద్రాపురంలోకి ఎంటర్ అవుతున్న జగన్ పాదయాత్రను తామరాడ బ్రిడ్జి వద్ద కాపు నేతలు అడ్డుకున్నారు. జగన్ భద్రతా సిబ్బంది, కాపు యువతను తోయడంతో.. కొద్దిసేపు ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.

Comment here