Local news

జగన్ ఇప్పుడిలా మాట్లాడడం సరికాదు : ముద్రగడ పద్మనాభం

వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై కాపు ఉద్యమనేత మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిన్న జగన్ కాపు రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యంకాదని చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ముద్రగడ ఆదివారం ప్రెస్ మీట్లో మాట్లాడుతూ తుని ఘటన తర్వాత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ కాపు రిజర్వేషన్లలకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారని, అసెంబ్లీలోనూ మద్దతు పలికారని గుర్తు చేశారు. ఇప్పుడేమో రాష్ట్ర పరిధిలోని అంశం2 కాదని జగన్ చెప్పడం బాధాకరమని అన్నారు. కాపులు ఎప్పుడూ మీ మోచేతి నీళ్లు తాగుతూ మీ పల్లకీలే మోస్తూ ఉండాలా అని ముద్రగడ మండిపడ్డారు. కాపు ఉద్యమం పుట్టిన గడ్డమీదే కాపులను అవమానించడం దుర్మార్గమని, తమ జాతిపై జగన్ చూపు చూస్తున్నారని, తమజాతి ఏమి తప్పుచేసిందో జగన్ చెప్పాలని ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు.కాపు రిజర్వేషన్లు కేంద్ర పరిధిలో ఉన్నాయి, తనకు సంబంధంలేదన్న జగన్, మరి కేంద్రపరిధిలో ఉన్న అనేక విషయాలపై ఎందుకు ఉద్యమాలు చేస్తున్నారని ముద్రగడ ప్రశ్నించారు. గత 6నెలలుగా జగన్ పాదయాత్రలో ఇస్తున్న హామీలకు రాష్ట, కేంద్ర బడ్జెట్లు సరిపోతాయా…. అని ప్రశ్నించారు. జగన్ పదవీకాంక్షతో ఇలాంటి అమలు చేయలేని హామీలు ఇవ్వవచ్చు కానీ … కాపూజాతికి మాత్రం రిజర్వేషన్ ఇవ్వలేరా…అని ముద్రగడ మండిపడ్డారు. తమ కాపూజాతి సమస్య తీర్చలేనప్పుడు తాము జగన్ కు ఓట్లు ఎందుకు వెయ్యాలి అని ప్రశ్నించారు…..KS

Comment here