ఇది బ్లాక్ డే : రజనీకాంత్

డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మంగళవారం సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో గతకొన్ని రోజులుగా బాధపడుతున్న ఆయన చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల ప్రముఖులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆగస్టు 7.. బ్లాక్ డేగా అభివర్ణించారు. రజనీకాంత్, రాధిక, హన్సిక, ఖుష్బూ తదితరులు ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తంచేశారు.
* రజనీకాంత్ : “ఇది బ్లాక్ డే. ఈరోజు నేను ఎప్పుడూ మర్చిపోలేను.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా”.
* రాధిక : “ఇది మాకు చీకటిరోజు. నా మనస్సు మొత్తం ఆయనతో ఉన్న మధుర జ్ఞాపకాలతో నిండిపోయింది. తమిళుల కోసం పోరాడిన వ్యక్తి కరుణానిధి. ఆయన సంకల్పం ఎప్పుడూ జీవంతోనే ఉంటుంది. ఆయన్ను మిస్సయ్యాం. ఓ గొప్ప నాయకుడు మమ్మల్ని వదలి వెళ్లిపోయారు. ఆయనకు కన్నీటి వీడ్కోలు”.
* హన్సిక : “దేశంలోనే ఓ గొప్ప నాయకుడు. కరుణానిధి గారు కన్ను మూశారు. ఈలోటును జీర్ణించుకునే ధైర్యాన్ని ఆయన కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, మొత్తం తమిళులకు ఆ దేవుడు “ప్రసాదించాలని కోరుకుంటున్నా”.
* ఖుష్బూ : “నెలక్రితం నేను ఆయనతో కలిసి దిగిన ఫోటో ఇది. గొప్ప నాయకుడైన ఆయన్ను కలవడం అదే చివరి సారి అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు. మేం మిమ్మల్ని మిస్ అవుతున్నాం అప్పా”.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here