Cinema

తాను ఇక ఇంతో కాలం బతకను అంటోన్న ఇర్ఫాన్ ఖాన్

మనకున్న గొప్ప నటుల్లో ఒకరు ఇర్ఫాన్ ఖాన్… హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ఇలా తాను నటించిన ప్రతి భాషలో తన నటునతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆయన గత కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే.. న్యూరో ఎండోక్రిన్‌ ట్యూమర్‌ కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం లండన్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇర్ఫాన్‌ఖాన్‌ తన అభిమానులను షాక్‌కు గురి చేసే సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎంతో కాలం బతకనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు సోకిన కేన్సర్‌కు ఆరు దశల్లో కీమోథెరఫీ చేయాల్సి ఉంటుందని, ప్రస్తుతం నాలుగు దశలు పూర్తయ్యాయని వివరించారు. మిగతా రెండు దశలు పూర్తయ్యాక స్కానింగ్‌ చేస్తారని, ఆ తర్వాత కూడా జీవించగలనన్న నమ్మకం లేదని అన్నారు. దీంతో అటు పరిశ్రమ.. ఇటు అభిమానులు కన్నీరు పెట్టుతున్నారు. ఇర్ఫాన్ ఖాన్ ఆరోగ్యం తిరిగి పొందాలని ఆయన నిండు నూరెళ్ళు బతకాలని కోరుకుంటున్నారు.

Comment here