ఇండోనేషియాలో భారీ భూకంపం… 82మంది మృతి

ఇండోనేషియా మరో సారి భూకంపం ధాటికి చిగురుటాకులా వణికింది. లాంబాక్ దీవుల్లో ఆదివారం రాత్రి 7.30 గంటల సమయంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్ పై 7 గా నమోదు అయ్యింది. పలు ఇళ్ళు నేలమట్టం కావడంతో దాదాపు 82 మంది మృతి చెందారు. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.
లాంబాక్ దీవుల్లోని భూగర్భంలో పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు యూఎస్‌జీఎస్‌ అధికారులు వెల్లడించారు. భూ ప్రకంపనల కారణంగా తొలుత సునామీ హెచ్చరికలు జారీ చేసినా.. ఆతరువాత వాటిని ఉపసంహరించుకున్నారు.


భూకంప తీవ్రతకు భారీగా ఆస్థి నష్టం సంభవించింది. వందలాది ఇళ్లు నేల మట్టంకాగా.. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వారందరిని సమీపంలోని పునరావాస కేంద్రాలకు తరలించి సహాయక చర్యలు అందిస్తున్నారు.
గత వారంలో ఇదే దీవిలో వచ్చిన భూకంప తీవ్రత కంటే… ఇప్పుడు వచ్చిన భూకంపం ఎక్కువ అని అధికారులు చెప్పరుయ్. వారం రోజుల క్రితం ఇదే దీవిలో భూకంపం సంభవించగా 17 మంది మరణించారు. ఇప్పుడు వచ్చిన భూకంపం దాని కంటే కూడా ఎక్కువేనని అధికారులు తెలిపారు. ఇండోనేషియాతోపాటు చుట్టుపక్కల దేశాల్లోనూ ప్రకంపనలు వచ్చాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here