భారత్ ఒక అడుగు ముందుకేస్తే., మేం రెండడుగులేస్తాం : ఇమ్రాన్ ఖాన్

In this photo provided by the office of Pakistan Tehreek-e-Insaf party, Pakistani politician Imran Khan, chief of Pakistan Tehreek-e-Insaf party, delivers his address in Islamabad, Pakistan, Thursday, July 26, 2018. Khan declared victory Thursday for his party in the country's general elections, promising a "new" Pakistan following a vote that was marred by allegations of fraud and militant violence. (Tehreek-e-Insaf via AP)

కాశ్మీర్ సమస్య పరిష్కారానికి భారత్ ఒక అడుగు ముందుకేస్తే తాము రెండడుగులు వేస్తామని పాకిస్థాన్ ఎన్నికల్లో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన పిటిఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. సైన్యం ప్రమేయంతో భారీగా రిగ్గింగ్ జరిగినట్లు వెల్లువెత్తుతున్న విమర్శల నడుమ కొనసాగుతున్న ఓట్ల లెక్కింపులో విజయం తన పార్టీనే వరించినట్లు మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ చెప్పుకున్నారు. 272 స్థానాలున్న పార్లమెంట్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 137 సీట్ల సాధారణ మెజారిటీ ఆ పార్టీకి లభించలేదు. పిటిఐ పార్టీ 126 సీట్ల దగ్గరే ఆగిపోయింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతు కూడగట్టేందుకు మిత్రుల కోసం అది వెతుకుతోంది. ఈ ఎన్నికలను తాము గుర్తించడంలేదని పాక్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ ముస్లిం లీగ్ నేత నవాజ్ షరీఫ్ ప్రకటించారు. ఇంకా పిపిపి పార్టీ మరియు ఇతర చిన్న పార్టీలు ఎన్నికల్లో భారీ అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆరోపిస్తున్నాయి….KS
ఎన్నికల ఫలితాలు
మొత్తం స్థానాలు 272
వెల్లడైన గెలుపుఆధిక్యతలు 270
పిటిఐ 126
పిఎంఎల్-ఎన్ 61
పీపీపీ 40
ఇతరలు 43

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here