ఇంగ్లండ్ 396/7 డిక్లేర్

ఇండియా-ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా లార్డ్స్ లో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ తన మొదటి ఇన్నింగ్స్లో 396/7 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఇండియా తొలి ఇన్నింగ్స్లో 107 పరుగలకే ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఇంగ్లండ్ 289 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఇంగ్లండ్ బాట్సమెన్ క్రిస్ వోక్స్ 137 పరుగులతో అజేయంగా నిలిచాడు. జానీ బెయిర్ స్ట్రోక్స్ 93 పరుగులు, సామ్ కుర్రన్ 40 పరుగులు చేశారు.ఇండియా బౌలర్లలో షమీ 3 వికెట్లు, పాండ్యా 3 వికెట్లు ఇషాంత్ 1వికెట్ తీశారు. ఇప్పటికే 289 పరుగులు వెనుకబడిన ఇండియా తన రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించింది. సున్నాకే విజయ్ వికెట్ కోల్పోయింది.3వ ఓవర్లో ఆండ్రూసన్ బౌలింగ్ లో కీపీరికి క్యాచ్ ఇచ్చి విజయ్ (0) ఔట్ అయ్యాడు. మరలా 7వ ఓవర్లో రాహుల్ కూడా ఎల్బీడబ్య్లు గా వెనుదిరిగాడు. లంచ్ విరామానికి ఇండియా 9 ఓవర్లలో 17 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్లో ఇండియా పరాజయాన్ని ఆపగలిగేది ఒక్క వరుణుడే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here