Latest UpdatesNational

ఇండియా టీవీ ప్రీ పోల్ సర్వే ! అధికారం ఎవరిదో తేలిపోయింది

India Today Pre Poll Survey

దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది . దీనితో రాజకీయ పార్టీలు గెలుపుకోసం అస్త్రశస్త్రాలను సిద్ధం చేతున్నాయి ..ఈ నేపథ్యంలో మరో సర్వే వెలువడింది. ఇండియా టీవీ – సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ సర్వే పేరిట రిలీజైన సర్వేలో ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన కొద్ది గంటల్లోనే విడుదలైన ఈ సర్వే… కేంద్రంలో మరోమారు ఎన్డీఏనే అధికార పగ్గాలు దక్కించు కుంటుందని పేర్కొన్నది.. ఇక ఏపీ విషయానికి వస్తే .. విపక్ష వైసీపీ ఘన విజయం సాధిస్తుందని సర్వే తేల్చేసింది. లోక్ సభ సీట్ల వరకే ఈ సర్వే వెలువడింది … ఏపీలోని మొత్తం 25 ఎంపీ సీట్లలో జగన్ పార్టీ ఏకంగా 22 సీట్లను కైవసం చేసుకుంటుందని సర్వే పేర్కొంది. టీడీపీ కేవలం మూడు ఎంపీ సీట్లకు మాత్రమే పరిమితమవుతుందని ఆ సర్వే తెలిపింది .ఈ సర్వే పూర్తి వివరాలకు వస్తే … 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వస్తుంది. 2014 ఎన్నికల్లో కంటే ఆ కూటమికి దాదాపు నలభై సీట్లు తగ్గుతాయని. కానీ ఎన్డీఏనే అధికారంలోకి వస్తుందని ఈ సర్వేలో వెల్లడైంది. బీజేపీకి 238 సీట్లు ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి 285 సీట్లు వస్తాయని ఈ సర్వే ఫలితాలు చెబుతున్నాయి. బీజేపీకి 2014లో ఒంటరిగా 282 సీట్లు వచ్చాయి. ఈసారి 238 సీట్లు వస్తాయని ఈ సర్వేలో తేలింది. అంటే గతంలో కంటే 44 సీట్లు తక్కువ వస్తాయన్న మాట. ఇక కాంగ్రెస్ కూటమికి కొంతవరకు సీట్లు పెరగనున్నాయని ఈ సర్వే తేల్చింది..మార్చి 1వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ మధ్య ఈ సర్వేఈ సర్వే నిత్వహించినట్టు ఆ సంస్థ ప్రకటించింది .. ఇక తెలంగాణ విషయానికి వస్తే… ఆ రాష్ట్రంలోని మొత్తం 17 ఎంపీ సీట్లలో అధికార టీఆర్ఎస్ 14 సీట్లను గెలుచుకోనుండగా… ఆ పార్టీకి మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న మజ్లిస్ ఓ స్థానాన్ని దక్కించుకుంటుంది . ఇక మిగిలిన రెండు సీట్లను కాంగ్రెస్ పార్టీ చేజిక్కించు కుంటుందని ఈ సర్వే తేల్చింది.గత ఎన్నికల్లో యూపీఏ 80 సీట్లు గెలిచింది. ఈ సారి 126 సీట్లు గెలుచుకోనుందని ఫలితాలు వెల్లడిస్తున్నాయి. గతంలో కంటే 46 సీట్లు ఎక్కువగా రానున్నాయి. కాంగ్రెస్ పార్టీ స్వయంగా 82 సీట్లు గెలుచుకోనుందట. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 44 స్థానాలకే పరిమితమైంది. గతంలో కంటే 38 సీట్లు ఎక్కువగా గెలవనుంది. ఉత్తర ప్రదేశ్లో బీఎస్పీ ఎస్పీ కూటమికి 34 సీట్లు రానున్నాయని ఈ సర్వేలో తేలింది. బీఎస్పీకి 16 ఎస్పీకి 18 సీట్లు వస్తాయని తేలింది. గత ఎన్నికల్లో 71 సీట్లు గెలిచిన బీజేపీ ఈసారి 40 వరకు గెలవనుందని ఈ సర్వే ఫలితాలు వెల్లడించాయి. ఇక దేశవ్యాప్తంగా ఫలితాలను గమనిస్తే..బీజేపీ 238, కాంగ్రెస్ 82, తృణమూల్ కాంగ్రెస్ 30, వైస్సార్ కాంగ్రెస్ 22, ఎస్పీ 18, బీఎస్పీ 16, DMK 16, AIADMK 12, TRS 14, Left Front 6, JD(U) 12, NCP 7, RJD 8, శివ సేన 10, BJD 14, ఇతర పార్టీలు 38 గెలవనున్నాయి .. మొత్తంగా చూస్తే..కేంద్రంలో బీజేపీ , ఆంధ్రాలో వైసీపీ అధికారానికి రావడం ఖాయమని సర్వే అభిప్రాయపడింది ..