దేశానికి, ప్రపంచానికి మోదీ గొప్పనేత : ఎంపీ గంగరాజు

దేశానికి, ప్రపంచానికి, మోదీ గొప్ప నేతని బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ వరకే గొప్ప నేతని ఆయన అన్నారు. జాతీయనేత కావాలంటే గొప్పతనాన్ని నిరూపించుకోవాలన్నారు. విభజన తర్వాత కట్టుబట్టలతో వచ్చామని చంద్రబాబు చెబుతూ ఉంటారని, 2014 నుంచి రాష్ట్రానికి ఎన్ని నిధులు వచ్చాయో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఇచ్చిన ఉపాధినిధులు లేకుండా గ్రామాల్లో ఏం చేశారో చెప్పాలని అడిగారు. కేంద్రం నుంచి సాయం పొంది, దాన్ని మర్చిపోతే అది విశ్వాసఘాతుకం అవుతుందని గోకరాజు గంగరాజు అన్నారు. ప్రతి విషయానికి కేంద్రప్రభుత్వంపై విమర్శలు చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here