Sports

రెండవ టెస్టు కూడా దాదాపు ఓడినట్లే ఇండియా 66/6

ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండవ టెస్టులో టీమిండియా దాదాపు ఓడినట్లే! ప్రధాన బ్యాట్స్ మెన్ అంతా పెవిలియన్ కు క్యూ కట్టారు. మురళి విజయ్ (0), లోకేష్ రాహుల్ (10), పుజారా (17), రహానే (13), కోహ్లీ (17) ఔట్ అయ్యి పెవిలియన్ చేరారు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టువర్ట్ బ్రాడ్ అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్, ఇన్ స్వింగర్లు, ఔట్ స్వింగర్లతో ఇండియా బ్యాట్స్మన్ని బెంబేలెత్తించి 4 వికెట్లు తీసాడు. మరోవైపు జేమ్స్ ఆండ్రూసన్ కూడా 2 వికెట్లు తీసాడు. నాల్గవ రోజు టీ విరామ సమయానికి ఇండియా 32 ఓవర్లలో 66/6 తో ఉంది.

Comment here