ఇండియాను ఊరిస్తున్న విజయం

ఇండియా-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ లో ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్ లో 180 పరుగలకే ఆలౌట్ అయ్యింది. మూడో రోజు ఆటలో భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఇషాంత్ శర్మ 5 వికెట్లు, అశ్విన్ 3 వికెట్లు, ఉమేశ్ యాదవ్ 2 వికెట్లు తీశారు. అనంతరం194 పరుగుల విజయ లక్ష్యం తో తమ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్ 36 ఓవర్ల లో 110 పరుగులు చేసి ఐదు వికెట్లను(మురళి విజయ్6, శిఖర్ ధావన్13, కె.ఎల్.రాహుల్13, రహనే2, అశ్విన్13)కోల్పోయింది. విరాట్ 43పరుగులతోనూ, దినేష్ కార్తీక్ 18 పరుగులతోనూ ఆడుతున్నారు. ఇంకా విజయాన్ని అందుకోవాలంటే 84 పరుగులు చేయాలి. ఇండియా ఆశలన్నీ కెప్టైన్ విరాట్ కోహ్లీపైనే ఆధారపడి ఉన్నాయి.మొదటి ఇన్నింగ్స్లో 149 పరుగులు చేసిన కోహ్లి తప్పక గెలిపిస్తాడని భారత అభిమానులందరూ ఎదురు చూస్తున్నారు.ఈరోజు ఆట మొదలవగానే మొదటి పది ఓవర్లు వికెట్ పడకుండా జాగ్రతగా ఆడగలిగితే ఇండియాదే విజయం.
ఇంగ్లండ్ 287 &180
ఇండియా 274 & 110/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here