Sports

ఇండియా 649/9 డిక్లేర్.. జడేజా శతకం

ఇండియా-వెస్టిండీస్ జట్ల మధ్య రాజకోట్ లో జరుజుతున్న తొలి టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 649/9 స్కోరు వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ ప్రకటించింది. అల్రౌండర్ రవీంద్ర జడేజా(100) సెంచరీ సాధించాడు. జడేజా సెంచరీ పూర్తయిన వెంటనే కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ మ్యాచ్లో భారత బాట్సమెన్ సెంచరీలు, హాఫ్ సెంచరీల మోత మోగించారు. ఓపెనర్ పృధ్వీ షా (134), కెప్టెన్ విరాట్ కోహ్లీ (139), రవీంద్ర జడేజా (100), ఛటేశ్వర్ పుజారా (86), రిషబ్ పంత్ (92) పరుగులు చేశారు. వెస్టిండీస్ బౌలర్లలో బిషూ 4 వికెట్లు, లేవీస్ 2 వికెట్లు, గాబ్రియల్, బ్రాత్ వైట్, చేస్ తలో విక్కెట్టు తీశారు.
ఇండియా:
పృధ్వీ షా 134
రాహుల్ 0
పూజారా 86
కోహ్లీ. 139
రహానే. 41
రిషబ్ పంత్ 92
జడేజా 100*
అశ్విన్ 7
కుల్దీప్ యాదవ్ 12
ఉమేష్ యాదవ్ 22
మొహమ్మద్ షమీ 2*

Comment here