భారత్ తొలి ఇన్నింగ్స్ లో 308/4…పృధ్వీషా, రహానే, పంత్ హాఫ్ సెంచరీలు

ఇండియా-వెస్టిండీస్ మధ్య హైదరాబాద్లో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ లో 311 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఉమేష్ యాదవ్ 6 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీశారు. రెండో రోజు 295/7 తో ఇన్నింగ్స్ కొనసాగించిన వెస్టిండీస్ కేవలం 16 పరుగులు మాత్రమే చేసి మిగిలిన మూడు వికెట్లను కోల్పోయింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా రాహుల్ తడబడినా మరోవైపు యువ కెరటం పృధ్వీషా ధాటిగా ఆడాడు. రాహుల్ (4) విఫలమైనప్పటికీ పృధ్వీషా (70) పరుగులు చేసి భారీ షాట్ కు ప్రయత్నించి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. పూజారా కూడా (10) పరుగులకే ఔట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ(45) కొద్దిసేపు బాగా ఆడాడు. అయితే హోల్డర్ వేసిన అద్భుత బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం క్రీజ్లోకి వచ్చిన రహానే(75*), రిషబ్ పంత్(85) మరో వికెట్ పడకుండా ఇద్దరూ ఐదో వికెట్ కు 138 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. టీమిండియా ఇంకా 3 పరుగులు వెనుకపడి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here