Local news

2019లో లక్ష ఐటీ ఉద్యోగాలు ప్రభుత్వ లక్ష్యం : మంత్రి లోకేష్

ఆంధ్రప్రదేశ్ కు వస్తున్న ఐటీ కంపెనీల్లో 60 శాతం విశాఖపట్టణంలలోనే ఏర్పాటు చేస్తామని ఐటీ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. శుక్రవారం లోకేష్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటివరకూ 36 వేల ఐటీ ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు. 2019లోగా లక్ష ఐటీ ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి లోకేష్ చెప్పారు. 2024వ సంవత్సరం నాటికి ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులు ఉండరని మంత్రి లోకేష్ చెప్పారు. 2019లో టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Comment here