ఇమ్రాన్ ఆహ్వానాన్ని అంగీకరిస్తున్నా : సిద్దూ

ఆగస్టు 11న ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంగా ఆయన భారత లెజెండరీ క్రికెటర్లకు ఆహ్వానం పంపారు. మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, నవజ్యోత్ సింగ్ సిద్దూ, బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కు కూడా ఇమ్రాన్ ఖాన్ ఆహ్వానం పంపించారు. తాను ఇమ్రాన్ ఆహ్వానాన్ని అంగీకరిస్తున్నానని, ప్రమాణస్వీకార కార్యకమానికి తప్పకుండా హాజరవుతానని మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి అయిన నవజ్యోత్ సింగ్ సిద్దూ తెలిపారు. ఇమ్రాన్ నమ్మదగిన వ్యక్తి అని, అతని కెప్టెన్సీలోనే పాకిస్థాన్ కు వరల్డ్ కప్ వచ్చిందని ప్రసంచించారు. తనకు ఆహ్వానం లభించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. ఖాన్ సాహెబ్ వ్యక్తిత్వమున్న మనిషి అని, నమ్మకస్తుడు కూడా అని సిద్దూ కితాబిచ్చారు. క్రీడాకారులు అడ్డుగోడలను తొలగించి వంతెనలను నిర్మిస్తారని, ప్రజలను ఐక్యం చేస్తారని సిద్దూ వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here