ఐఐటీ బాంబేకు వెయ్యి కోట్లు : మోదీ

ఐఐటీ బాంబేలో శనివారం జరిగిన స్నాతకోత్సవం వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ మీ ముఖాల్లో నమ్మకాన్ని నేను చూడగలను. ఆ నమ్మకమే చెబుతున్నది మనం సరైన దిశలోనే వెళ్తున్నామని, అని అన్నారు. వెయ్యి కోట్ల సాయాన్ని ప్రకటించారు. త్వరలోనే ఐఐటీ బాంబేకు 1000 కోట్ల ఆర్ధిక సాయం అందనుంది. దేశంలో ఐటీ సెక్టార్ ను పునాది నుంచి పైకి తీసుకొచ్చిందే ఐఐటీ విద్యార్థులు. ఈ 21వ శతాబ్దంలో కొత్త కొత్త ఆవిష్కరణలే విజయానికి నాంది అన్నారు. కొత్త కొత్త ఆలోచనలను ఆచరణలోకి తీసుకురాని ఏ సొసైటీ అయినా స్థంభించిపోతుంది.ఇండియాలో స్టార్ట్ అప్ కంపెనీలు ఊపిరిపోసుకున్నాయంటే.., అది ఇన్నోవేషన్ సత్తానే. దేశ యువత కొత్త ఆవిష్కరణలతో ముందుకెళ్లి దేశాన్ని ఉన్నతస్థానంలో నిలబెట్టేందుకు కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here