Local news

నేను ఐదేళ్లు ఉండి వెళ్ళటానికి రాలేదు : పవన్ కల్యాణ్

అధికారం సాధించడానికి ప్రశ్నించడమనేది మొదటి అంకమని, తాను ఐదేళ్లు ఉండి వెళ్ళటానికి రాజకీయాలలోకి రాలేదని జనసేనాని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. శుక్రవారం నరసాపురంలో పర్యటించిన జనసేనాని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ చంద్రబాబు లాగా నన్ను ముఖ్యమంత్రిని చేయండి అనో….,జగన్ లాగా నన్ను ముఖ్యమంత్రిని చేస్తేనే మీ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పటానికి నేను రాలేదు. ప్రజలకు అండగా నిలబడటానికి వచ్చానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తనకేమీ స్నేహితుడు కాదని, బంధువేమీ కాదని జనసేనాని పవన్ కల్యాణ్ చెప్పారు. టీడీపీ, వైసీపీ దోపిడీలు చూశామని.., కానీ జనసేన మాత్రం మీకు అండగా నిలబడేందుకు వచ్చిన పార్టీ అని పవన్ అన్నారు. తాను కులాన్ని నమ్ముకున్న వ్యక్తిని కాదన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు, జగన్ కుటుంబాల మధ్య నలిగిపోతున్నారని అన్నారు.గత ఎన్నికల్లో టీడీపీకి అండగా నిలబడిన బీసీలు, కాపులకు రాష్ట్ర ప్రభుత్వం ద్రోహం చేసిందని జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్రంగా విమర్శించారు.

Comment here