తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా హైఅలర్ట్

Chennai: Congress President Rahul Gandhi visits the ailing DMK president M Karunanidhi, who continues to remain in the intensive care for the fourth consecutive day, at the Kauvery Hospital in Chennai on Tuesday, July 31, 2018. (PTI Photo) (PTI7_31_2018_000175B)

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. దీంతో కావేరీ ఆస్పత్రికి భారీగా నేతలు, కార్యకర్తలు, అభిమానులు చేరుకుంటున్నారు. కరుణానిధి ఫోటోలు పట్టుకుని రోధిస్తున్నారు. కోలుకుని ఆస్పత్రి నుండి బయటకు రావాలని ప్రార్ధనలు చేస్తున్నారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి కావేరీ ఆస్పత్రికి వచ్చి కరుణానిధిని పరామర్శించారు. స్టాలిన్, కనిమొళితో మాట్లాడి కరుణానిధి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి బయట అభిమానులను కనిమొళి కలిశారు. కరుణానిధి త్వరగా కొలుకుంటారని, ఆయన కోసం ప్రార్ధించాలని కోరారు.అలాగే ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో కూడా కరుణానిధిని పరామర్శించారు. తమిళనాడు వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. కరుణానిధి ఆరోగ్యంపై రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కావేరీ ఆసుపత్రి వద్ద 600 మంది 24 గంటలూ విధులు నిర్వహిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here