వర్షాలకు వణుకుతున్న ముంబై… మరో 2 రోజులు భారీ వర్షాలు

దేశ ఆర్ధిక రాజధాని ముంబై ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో… నగరం తడిచి ముద్దైంది. రోడ్లు కాలవలను తలపిస్తున్నాయి. పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల వాహనాలు నీళ్లలో నిలిచిపోయి మొరాయించాయి. వర్షాలతో ముంబై నగర వాసుల జనజీవనం అస్తవ్యస్తమైంది. ముఖ్యంగా, శ్యాం తలావ్, హింద్ మట, ఒబేరాయ్ మాల్, సీఎస్టీ రోడ్డు, కుర్లా, మాహిమ్ జంక్షన్, నెహ్రూనగర్ బ్రిడ్జి, శాంతాక్రజ్, చెంబూర్ లింక్ రోడ్డు ప్రాంతాల్లో వరద నీరు నిలిచింది. రోడ్లపై నిలిచిన వాననీటిని తొలగించేందుకు ముంబై కార్పొరేషన్‌ సహాయక చర్యలు చేపట్టింది.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ముంబై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్కూళ్లు, లోకల్ రైళ్లు చాలావరకు రద్దుచేశారు. చాలా చోట్ల రైలు పట్టాలపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. కొన్ని రైల్వే సర్వీసులను దారిమళ్లించారు. పశ్చిమ, సెంట్రల్, హార్బర్‌ 3 మార్గాల్లో లోకల్‌ రైళ్లన్నీ ఆలస్యంగా నడుస్తున్నాయి. విమాన రాకపోకలపైనా తీవ్ర ప్రభావం పడుతోంది. చాలా సర్వీసులు ఆలస్యమవుతున్నాయి. మరోవైపు రానున్న 24 గంటల్లో ముంబైలో భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ కేంద్రం అంచనాతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here