Health

రోగనిరోధక శక్తిని పెంచే పనసపండు తినడం వల్ల అనేక లాభాలు

తండ్రి గరగర తల్లి పీచు పీచు బిడ్డలు రత్నమాణిక్యాలు, మనుమలు బొమ్మరాళ్ళు ఎవరది..? అనే సామెత అడిగితె వెంటనే మనం పనసపండు అని చెబుతాం.. మనం ఇష్టంగా తినే పండులో ఒక కుటుంబం..లోని సభ్యులు కూడా దాగుతున్నారు.. ఇక ప్రపంచంలోనే అతి పెద్ద పండును ఇచ్చే చెట్టు పనస. పండ్లు మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలుగా వస్తున్నా ఆచారం.. అన్నంతో అవసరం లేకుండా ప్రకృతిసిద్ధమైన పండ్లు, కూరగాయలు ఇతర త్రుణధన్యాలను ఆహారంగా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి … ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని ప్రకృతి వైద్యుల నమ్మకం .. ఇక ఆకర్షణీయమైన రంగులో చూసేందుకు ఎంతో చక్కగా కనిపించే పనస పండును తినడం వల్ల అనేక ఆరోగ్యకరమైన లాభాలు ఉన్నాయట.

పనస పండు సంపూర్ణమైన మరియు బలవర్దకమైన ఆహారం. ఇందులో విటమిన్ ఎ, సి, బి6తో పాటు ధియామిన్, రిబోప్లానిన్, నియాసిన్, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, సోడియం, జింక్ మరియు ఫైబర్‌ను సమృద్ధిగా కలిగి ఉంది.
పనస పండ్లలోని ఫైటోన్యూట్రియంట్స్, ఐసోప్లేవిన్స్ క్యాన్సర్ కారక కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. పనసలో ఖనిజాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. కణజాలాల నాశనాన్ని అడ్డుకుంటాయి
పనస పండ్లను రెగ్యులర్‌గా తింటే పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. వీర్యకణాలు వృద్ధి చెందుతాయి. అంగస్తంభన సమస్యల్ని తగ్గించి శృంగారంలో అధిక ఆనందం కలిగించేలా చేస్తుంది. సంతానం కలిగే అవకాశాలు రెట్టింపు అవుతాయి.
శరీరంలోని రోగ నిరోధరక శక్తిని పెంచుతుంది. అనేక రుగ్మతల బారినుండి కాపాడుతుంది. అంతేకాకుండా ఇది ప్రేగు మరియు లంగ్స్ క్యాన్సర్‌కు కారణమయ్యే కారకాలతో పోరాడి డి.ఎన్.ఎ ను డ్యామేజీ బారి నుండి కాపాడుతుంది.

ఇందులో ఉండే సోడియం అధిక రక్తపోటు బారి నుండి కాపాడి గుండె నొప్పి మరియు గుండె పోటు సమస్యల తీవ్రతను తగ్గిస్తుంది. ఆస్తమా వంటి శ్వాసకోస వ్యాధుల నుండి కాపాడుతుంది.
పనస పండు షుగర్ వ్యాధి ఉన్నవారికి మంచి ఆహారం. ఈ పండు తినడం వలన శరీరానికి ఇన్సులిన్ అందించిన దానితో సమానం అవుతుంది. ఇది శరీరంలోని గ్లూకోజ్ లెవల్ పెరిగేలా చేస్తుంది.
ఇందులో ఉండే విటమిన్ ఎ కంటిచూపును మెరుగుపరుస్తుంది. రేచీకటి సమస్యను తగ్గిస్తుంది. దృష్టి మెరుగు పడుతుంది. శుక్లాలు వచ్చే అవకాశం తగ్గుతుంది.

అంతేకాకుండా చర్మం మరియు జుట్టు ఆరోగ్యంతో ఉండేలా సహాయపడుతుంది
రక్తహీనత సమస్యతో బాధపడేవారికి పనసపండు మంచి ఫలితాన్నిస్తుంది. పనసపండులో ఉండే పోషకాలు మరియు విటమిన్స్ రక్తహీనత సమస్యను తగ్గిస్తాయి. అంతేకాకుండా రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్దీకరిస్తుంది.

పనసపండులో ఉన్న క్యాల్షియం శరీరంలోని ఎముకలను బలోపేతం చేస్తుంది. ఎముకలు పెళుసుగా మారే సమస్యలను చాలావరకు తగ్గిస్తుంది. కండరాలను బలోపేతం చేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ జీవక్రియలను సాఫీగా జరిగేలా చేస్తుంది. కడుపులో ఏర్పడే గ్యాస్ మరియు అల్సర్ వంటి జీర్ణ సంబంధిత వ్యాధులను నివారిస్తుంది.

పనసపండు చర్మ కాంతిని పెంచుతుంది. చర్మంపై మృత కణాలు తొలగించి చర్మం కాంతివంతంగా ఉండేలా చేస్తుంది. పనస పండు తినడం వలన శరీరానికి శక్తి బాగా అందుతుంది. శారీరక శ్రమ ఎక్కువగా చేసే వారు, వ్యాయామం చేసే వారు, పిల్లలు ఈ పండును తింటుంటే రోజంతటికీ కావల్సిన శక్తి లభిస్తుంది. దీంతో ఉత్సాహంగా, యాక్టివ్‌గా పనిచేస్తారు. మరిన్ని ప్రయోజనాలు ఉన్న పనస పండును తినండి.. ఆరోగ్యంగా ఉండండి..

Comment here