National

క్వశ్చన్ అవర్ ను రద్దు చేసే ఆలోచనేమీ లేదు : వెంకయ్యనాయుడు

బుధవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే., మంగళవారం రాజ్యసభలో జరిగిన గందరగోళం తనను కలచివేసిందని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు చెప్పారు. క్వశ్చన్ అవర్ ను రద్దు చేసే ఆలోచనేదీ తనకు లేదని, సభ్యులు వెల్ లోకి వచ్చి ఆందోళన చేయడం తగదని వెంకయ్యనాయుడు హితవు పలికారు. సభలో సక్రమంగా చర్చ జరిగేలా సభ్యులందరూ సహకరించాలని, పెద్దల సభ గౌరవాన్ని కాపాడాలని వెంకయ్యనాయుడు కోరారు. పార్లమెంటు బయట నిరసనలు, ఆందోళనలు చేసుకుంటే తనకు అభ్యంతరం లేదని, కానీ సభలో మాత్రం ప్రజా సమస్యలపై చర్చకు సహకరించాలని సభ్యులకు సూచించారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఎంత చెప్పినా వినకుండా కొందరు సభ్యులు సభలో ఆందోళన చేశారు. అమిత్ షా ప్రసంగానికి అడ్డుతగులుతూ నినాదాలు చేశారు. వెంకయ్యనాయుడు ఎంత చెప్పినా వినకపోవడంతో సభను మధ్యాహ్నం వరకూ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

Comment here