43వ వసంతంలోకి అడుగు పెట్టిన మహేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలతో…

సూపర్ స్టార్ కృష్ణ తనయుడు గా మహేష్ బాబు బాలనటుడుగా వెండి తెరపై అడుగు పెట్టి.. రాజకుమారుడు సినిమాతో హీరోగా మారాడు. అందం అభినయం మహేష్ బాబు సొంతం. నేడు టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు పుట్టిన రోజు.. అభిమానులకు పండగ రోజు… నేటితో మహేష్ బాబు 43వ వసంతంలోకి అడుగు పెట్టాడు. మంచితనం వ్యక్తిత్వం తో సిని సెలబ్రేటిల నుంచి సామాన్యుల వరకు అమితంగా ఇష్టపడే మహేష్ బాబు కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ లు మంచి స్నేహితులు..

ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా మహేష్ బాబుని ఇష్టపడతారు.. మహేష్ బాబు తన సినిమాలో మంచిప్రదర్శన కనబరిచిన సమయంలో ఫోన్ చేసి మరీ అభినందిస్తారు అని మహేష్ చాలా సందర్భాల్లో గుర్తు చేసుకున్నాడు. ఇక రామ్ చరణ్ అయితే మహేష్ అందంలో తనకు కాస్త ఉన్నా బాగుండును అనిపిస్తుంది అని చెప్పాడు.. ఇక వరుణ్ తేజ్ అయితే తనకు మహేష్ తో మల్టీ స్టారర్ సినిమా చేయాలనీ ఉంది అని చెప్పాడు.. అంతేకాదు.. త్రివిక్రమ్ , మహేష్, సుకుమార్ మహేష్ ఇలా తను పనిచేసిన దర్శకుకులతో మంచి స్నేహ సంబంధం కొనసాగించే మంచితనం మహేష్ సొంతం… ఈ రోజు మహేష్ పుట్టిన రోజు సందర్భంగా సెలబ్రిటీ లతో పాటు సామాన్యులు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహేష్ బాబు 25 వ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు రిలీజ్ చేసింది చిత్ర యూనిట్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here