జి.వి.ఎల్ వి తప్పుడు లెక్కలు : వర్ల రామయ్య

రాష్ట్ర ప్రభుత్వంపై తరచూ అవినీతి ఆరోపణలు చేస్తున్న బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ జి.వి.ఎల్ నర్సింహారావుపై ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య తీవ్రంగా మండిపడ్డారు. 15వేల కోట్ల రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం యూసీలు ఇవ్వలేదని చెబుతున్న జి.వి.ఎల్., ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం లక్షా 54వేల కోట్ల రూపాయల నిధులకు యూసీలు ఇవ్వకపోయినా ఎందుకు అడగటం లేదని ప్రశ్నించారు. అక్కడి బీజేపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని జీవిఎల్ అంగీకరిస్తారా? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం కూడా 89వేల కోట్ల రూ. విద్యాహక్కు రుసుములకు సంబంధించి లెక్కలు చెప్పలేదని కాగ్ తన నివేదికలో పేర్కొందని, ఈ విషయంపై మోదీని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. జీవీఎల్ తానొక్కడే నీతిపరుడైనట్లు మాట్లాడుతున్నారని., ఆయనకు ఐదు రాష్ట్రాలలో కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పగల ధైర్యముందా అని సవాల్ విసిరారు. ఆస్తులకు సంబంధించి జీవీఎల్ తప్పుడు లెక్కలు చెబుతున్నారని వర్ల రామయ్య విమర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here